కమల్ మాటలకు హర్టయిన వాణీ!

Posted On:04-07-2015
No.Of Views:294

కమలహాసన్ తన మొదటి భార్య వాణీ గణపతికి చాలాకాలం క్రితమే విడాకులు ఇచ్చేశాడు. అప్పట్లో ఆమెకి పెద్దమొత్తంలో 'మనోవర్తి'ని చెల్లించడం వలన తాను దివాలా తీసినట్టుగా కమల్ ఇటీవల ఒక సందర్భంలో చెప్పడం .. అలాంటి పరిస్థితుల్లో తాను సొంత ఇల్లు వదులుకుని అద్దె ఇంటికి మారాల్సి వచ్చిందని అనడం హాట్ టాపిక్ గా మారింది. అలా తన కారణంగా ఆయన ఇబ్బందుల్లో పడినట్లుగా మాట్లాడటం వాణీకి ఆగ్రహాన్ని కలిగించింది. దాంతో ఇంతకాలం మౌనంగా వున్న ఆమె, తీవ్రమైన స్థాయిలో తన అసహనాన్ని వ్యక్తం చేసింది. తనకి మనోవర్తిని చెల్లించడం వలన దివాలా తీసినట్టుగా కమల్ చెప్పుకోవడం హాస్యాస్పదమంటూ స్పందించింది. అసలు అప్పట్లో తమకి సొంత ఇల్లే లేదనీ .. అలాంటప్పుడు అద్దె ఇంట్లోకి మారినట్టుగా చెప్పడమేంటని ప్రశ్నించింది. ప్రస్తుతం తాను ఉంటోన్న ఇల్లు కూడా తాను కొనుక్కున్నదేనని స్పష్టం చేసింది. కమల్ దివాలా తీయడానికి వేరే కారణాలు ఉండొచ్చనీ, అందుకు తనని బాధ్యురాలిని చేస్తూ మాట్లాడటం భావ్యం కాదని పేర్కొంది.