శేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు!

Posted On:04-07-2015
No.Of Views:275

ప్రస్తుతం 'శ్రీమంతుడు' చిత్రాన్ని పూర్తి చేసి, 'బ్రహ్మోత్సవం' చేయడానికి సిద్ధమవుతున్న మహేష్ బాబు మరోపక్క ఇతర సినిమాలకు కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో 'ఆనంద్', 'గోదావరి', 'హ్యాపీడేస్' వంటి ఆహ్లాదకరమైన చిత్రాలను రూపొందించిన శేఖర్ కమ్ములతో కూడా సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అసలు గతంలోనే వీరిద్దరి కలయికలో ఓ సినిమా ప్లానింగ్ జరిగింది. అయితే, కారణాంతరాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మళ్లీ ఈ సన్నాహాలు ఊపందుకున్నట్టు సమాచారం. ఈ విషయంపై మహేష్, శేఖర్ మధ్య తాజాగా చర్చలు కూడా జరిగినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం మహేష్ కి తగ్గా కథను తయారుచేసే పనిలో శేఖర్ ఉన్నాడట!