అమర్ నాథ్ లో రామ్ చరణ్!

Posted On:04-07-2015
No.Of Views:285

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తల్లి కోరికను నెరవేర్చాడు. పవిత్రమైన అమర్ నాథ్ యాత్రను నిన్న తాను పూర్తి చేశాడు. ఈ యాత్రను పూర్తి చేయాలన్నది చరణ్ వాళ్లమ్మగారి కోరిక. దానిని నెరవేర్చగలిగినందుకు ప్రస్తుతం తాను ఎంతో సంతోషంగా వున్నాడు. దీని గురించి చరణ్ చెబుతూ, "సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తులో వున్న అమర్ నాథ్ కు చేరుకున్నాను. అమర్ నాథ్ యాత్ర పూర్తి చేయాలన్నది అమ్మ కల. అది నెరవేర్చాను" అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ ఇచ్చాడు. అంతేకాదు, తాను తీసిన అమర్ నాథ్ అందాల ఫొటోలను కూడా పోస్ట్ చేశాడు.