ఉరిశిక్షలు కొనసాగుతాయి: జైట్లీ

Posted On:31-07-2015
No.Of Views:292

న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ ఉరి తర్వాత మరిన్ని ఉరిశిక్షలు కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉగ్రవాద చర్యలను నియంత్రించేందుకు ఉరిశిక్ష అమలు తప్పదని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. యాకుబ్‌ను ఉరి తీయడం బాధ కలిగించిందంటోన్న కాంగ్రెస్ నేతలు ఇందిరాగాంధీ హత్య దోషులను ఉరితీసేటప్పుడు ఎక్కడికి పోయారని ఆయన ప్రశ్నించారు. ముంబై పేలుళ్ల కేసులో మిగతా దోషులు దొరికితే వారిని కూడా ఉరితీయాల్సిందేనని జైట్లీ చెప్పారు.