కూకట్ పల్లిలో అగ్ని ప్రమాదం: వ్యక్తి మృతి

Posted On:31-07-2015
No.Of Views:227

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లిలోని ఓరియన్ ఫర్నీచర్ షాపులో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో లిఫ్టులో ఇరుక్కుపోయి షఫియుద్దీన్ అనే వ్యక్తి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత ఆస్తి నష్టం అనే విషయం తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.