ఇంగ్లండ్ ఘన విజయం

Posted On:31-07-2015
No.Of Views:312

బర్మింగ్&హామ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్ లో ఇంగ్లండ్ ప్రస్తుతం 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 136 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 281 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 265 పరుగులు చేసి.. ఇంగ్లండ్ ముందు 121 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ రెండు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. దీంతో ఎనిమిది వికెట్ల తేడాతో ఆసీస్పై రెండు రోజులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.
తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ బ్యాట్స్ మన్ రోజర్స్ (52) అర్థ శతకం చేయగా.. మిగతా అందరూ విఫలమయ్యారు. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లో అలీ (59), రూట్ (63), బెల్ (53) అర్ధ శతకాలు చేశారు. ఇంగ్లండ్ బౌలర్ అండర్సన్ 6 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ బౌలర్ లియాన్ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు.రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ వార్నర్ (77), నెవిల్ (59), స్టార్క్ (58) అర్థ శతకాలు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫిన్ 6 వికెట్లు తీశాడు. ఛేజింగ్లో ఇంగ్లండ్ కేవలం లిత్ (12), కుక్ (7) వికెట్లు కోల్పోగా.. బెల్ (65), రూట్ (38) విజయాన్ని పూర్తి చేశారు.