సూర్యతో నిత్యామీనన్ రొమాన్స్

Posted On:31-07-2015
No.Of Views:285

నటి నిత్యామీనన్ హీరోయిన్&గా నటించడానికి అంగీకరించిందంటే ఆ పాత్రకు ప్రాముఖ్యత ఉన్నట్లే. ఎందుకంటే ఈ కేరళ ఏ పాత్రకు ఒక పట్టాన ఒప్పుకోరనే పేరుంది. అంతేకాదు ఈ మధ్య హీరోయిజం ఉన్న పాత్రలనే అంగీకరించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాంటిది నటుడు సూర్య చిత్రంలో రెండవ హీరోయిన్&గా నటించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్&లో వినిపిస్తున్న తాజా సమాచారం. సూర్య ప్రస్తుతం 24 అనే చిత్రాన్ని తన సొంత సంస్థ 2డీ బ్యానర్&లో నిర్మిస్తూ నటిస్తున్నారు. మలయాళం దర్శకుడు విక్రమ్&కుమార్ ద ర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే నటి సమంత ఒక హీరోయిన్&గా నటిస్తున్నారు. అయితే ఇందులో సూర్య త్రిపాత్రాభిన యం చేస్తున్నారని తెలిసింది.
 ఆయన మ రో పాత్రతో నటి నిత్యామీనన్ రొమాన్స్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై ఆమెతో చర్చలు జరుగుతున్నట్లు అయితే నిత్యామీనన్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే పాత్రకు ప్రాధాన్యత ఉండటం, దర్శకుడు విక్రమ్&కుమార్ కావడంతో నిత్యామీనన్ న టించడానికి పచ్చజెండా ఊపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు కూడా కాంచన-2 లో పాత్ర పరిధి తక్కువే అయినా అది నచ్చడంతో నటించిన విషయం గమనార్హం. షూటింగ్ జరుపుకుంటున్న 24 చిత్రానికి ఎ ఆర్ రెహ్మాన్ సంగీత బాణీలు కడుతున్నారు. కాలం ఇతివృత్తంగా సాగే సోషియా ఫాంటసీ కథా చిత్రాన్ని దీపావళికి విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.