శ్రుతిహాసన్ రూటే సపరేటు

Posted On:31-07-2015
No.Of Views:249

శ్రుతిహాసన్ రూటే సపరేటు. నటిగానే కాదు నిజ జీవితంలోను ఆమె వ్యక్తిత్వం ప్రత్యేకం. తన తండ్రి కమలహాసన్&ను ఆమె ఎప్పుడు ఉన్నత స్థాయిలోనే ఉంచి చూస్తారు. అంతేకాదు తన సరసన నటించే హీరోలను పొగిడేస్తారు. సమీప కాలంలో బాలీవుడ్ నటుడు అమీర్&ఖాన్ కంటే టాలీవుడ్ నటుడు మహేష్&బాబు ఫర్పెక్షనిస్ట్ అంటూ కితాబిచ్చిన శ్రుతి ప్రస్తుతం హిందీలో వెల్&కం బ్యాక్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర హీరో జాన్ అబ్రహాం ఈ సందర్భంగా ఆమెతో మాట్లాడుతూ తన తండ్రి కమలహాసన్ షూటింగ్ స్పాట్&లో ఉన్నప్పుడు తన పాత్ర గురించే కాకుండా సహ నటీనటులు, ఇతర చిత్ర యూనిట్ గురించి ఆలోచిస్తారన్నారు.ఆయన మాదిరిగానే నటుడు జాన్ అబ్రహాం అన్ని విషయాలు గ్రహిస్తారని పొగిడారు. సహ నటీనటుల నుంచి అండర్ స్టాండ్ కలిగి ఉంటారన్నారు. ఇక తన తండ్రి విషయానికొస్తే ఈ వయసులోనూ తాను ఎంచుకున్న కథా పాత్రగా మారిపోతారు. అందుకు కారణం ఆయన నిజమైన అంకిత భావమే నన్నారు. షూటింగ్&లో పాజిటివ్ మూడ్&తో పాటు కథా పాత్రకు తగ్గట్టుగా ఉండటం ముఖ్యం అన్నారు. అయితే తన తండ్రి మాదిరి తాను ఫిట్ కాదని అన్నారు. ఏది పడితే అది తింటునే ఉంటానని శ్రుతిహాసన్ పేర్కొన్నారు.