అమితాబ్ మదర్ సెంటిమెంట్...

Posted On:31-07-2015
No.Of Views:260

బిగ్‌బి అమితాబ్ మాతృమూర్తిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. చాలా సినిమాల్లో అమితాబ్ తల్లిగా నటించిన సులోచనను గుర్తు పెట్టుకుని ఆమె 86వ పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. అమితాబ్‌కు రియల్ కన్నతల్లి లేకపోయినా...రీల్ కన్నతల్లిని గుర్తుపెట్టుకొని ఈ వేడుకను చేయడం విశేషం. ఈ సందర్భంగా బిగ్‌బి ఆమె ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేయించారు. ఆ అనుభూతుల్ని, ఫోటోలను అమితాబ్‌ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘దీవార్, రోటీ కప్‌డా ఔర్ మకాన్, యారానా’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో సులోచన అమితాబ్‌కు తల్లిగా నటించి ప్రశంసలు అందుకున్నారు. బాలీవుడ్‌లో అనేక మంది హీరోలకు సులోచన తల్లిగా నటించారు.