సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళీ బోనాలు

Posted On:02-08-2015
No.Of Views:309

 సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళీ బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌, అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌, రాజ్యసభ సభ్యులు వి. హనుమంతరావు సహా పలువురు నేతలు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైను అమ్మవారి మొక్కులు తీర్చుకునేందుకు తెల్లవారు జాము నుంచే భక్తులు తరలి వస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ మహాంకాళీ అమ్మవారిని మనం ఆరాఽదించుకుంటే మనకు ఎలాంటి చెడు జరగదని, అధర్మంపై ధర్మం విజయం సాధిస్తుందని.. మన పూర్వీకులు మనకు అందించిన నమ్మకమని అన్నారు. ఆ నమ్మకానికి ప్రతీకగా లక్షలాదిమంది భక్తులు గత కొన్ని ఏళ్లుగా అనవాయితీగా పండుగ జరుపుకోవడం చాలా సంతోషమని ఆయన అన్నారు. మన తెలుగింటి ఆడపడుచులు, తెలంగాణ సోదర, సోదరీమణులు అందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.