పాక్ పరీక్షల్లో సిక్కుబాలిక టాప్

Posted On:02-08-2015
No.Of Views:282

పాకిస్థాన్‌లో మైనార్టీ సిక్కు వర్గానికి చెందిన మన్‌బీర్‌కౌర్ ఘనత సాధించారు. పదో తరగతి పరీక్షల్లో మొదటి ర్యాంకు తెచ్చుకున్నారు. 1100 మార్కులకు గాను ఆమెకు 1035 మార్కులు వచ్చాయి. మన్‌బీర్ తండ్రి జ్ఞాని ప్రేమ్ సింగ్ స్థానిక నంకానా సాహిబ్ గురుద్వారాలో ప్రధాన పూజారి. పాక్ జనాభాలో కేవలం ఒక్క శాతం మాత్రమే సిక్కులున్నారు. దేశ విభజనకు ముందు పాకిస్థాన్‌లో సిక్కులు జనాభాలో 25 శాతం ఉండేవారు. టెన్త్‌లో టాప్ వచ్చిందని తెలిసినప్పటి నుంచీ మన్‌బీర్ కౌర్‌ను అంతా అభినందనల్లో ముంచెత్తుతున్నారు. దైవభక్తి మెండుగా ఉన్న మన్‌బీర్ నిత్యం గురుద్వారాలో నిర్వహించే భజనల్లో పాల్గొంటుంటారు. డాక్టర్ కావాలనే ఆమె ఆశయం నెరవేరాలని ఆశీర్వదిద్దాం.