ఆదివారం శృంగార సైట్లు తెరచుకోలేదు

Posted On:02-08-2015
No.Of Views:341

 ఆదివారం ఉదయం భారతీయ శృంగార ప్రియులు కొంత ఆందోళనకు గురయ్యారు. అలవాటుగా పోర్న్ సైట్లు ఓపెన్ చేయగా.. అవి తెరచుకోలేదు. బీఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్, హాత్‌వే, యాక్ట్, వొడాఫోన్ వంటి ఇంటర్‌నెట్ సర్వీస్ ప్రొవైడర్ల వినియోగదారులు శృంగార సైట్లను యాక్సెస్ చేయలేకపోయారు. బ్లాంక్ పేజీలు కనిపించడంతో వారు తెల్ల ముఖాలు వేశారు. టెలీకమ్యూనికేషన్స్ ఆదేశాలతో పోర్న్ వెబ్ సైట్లను బ్లాక్ చేసినట్లు మెసేజ్ కనిపించడంతో హతాశులయ్యారు. దీంతో శృంగార ప్రియులు తమ ఆవేదనను సోషల్ మీడియాలో వెళ్ళగక్కారు. భారత్‌లో పోర్న్ సైట్లను బ్యాన్ చేస్తున్నారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. చాలామంది వినియోగదారులు తమ ఇంటర్ నెట్ సర్వీస్ ప్రొవైడర్లపై తమ ఆగ్రహం వెళ్ళగక్కారు. శృంగార వెబ్ సైట్లను బ్యాన్ చేస్తే అన్ లిమిటెడ్ డేటా ప్లాన్ తీసుకుని ఏమి చేసేదని ప్రశ్నించారు. హిందూ అతివాద రాజకీయ నేతలపైనా ట్విటర్‌లో తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు. ఇలాంటి చర్యలు వ్యక్తిగత స్వేచ్ఛకు ఆటంకమని అభిప్రాయపడ్డారు. ఓ వ్యక్తి తన ఇంటి నాలుగు గోడల మధ్య శృంగార సైట్లను వీక్షించడం తప్పా? అని ఇటీవల సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించిందని కొందరు గుర్తు చేశారు. అయితే భారత్‌తో పొర్న వెబ్‌సైట్ల బ్యాన్ మంచిదేనంటూ శృంగార ప్రియులకు కొందరు కౌంటర్ ఇచ్చారు. పిల్లలపై అత్యాచారాలు, దాడులు వంటి అరాచకాలకు ఇవి దారి తీస్తున్నాయని అభిప్రాయపడ్డారు. మరోవైపు భారత్‌లో పోర్న్ సైట్ల బ్యాన్ సాధ్యమేనా? అనే సందేహం వ్యక్తమవుతోంది. ఒక ప్రపంచ ప్రసిద్ధ పోర్న్ సైట్ అంచనా ప్రకారం ఆ సైటును వీక్షించే 14.2 బిలియన్లలో 40 శాతం మంది భారతీయులేనట. శృంగార సైట్ల వీక్షకుల్లో మిజోరామ్ వాసులు మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో ఢిల్లీ వాసులున్నారు. భారతీయులు ఎక్కువగా సన్నీలియోన్ వీడియోలు చూస్తారట.