ప్రత్యేక హోదా కోసం అవసరమైతే రాజీనామా: ఎంపీ మురళీమోహన్

Posted On:02-08-2015
No.Of Views:302

రాజమండ్రి, ఆగస్టు, 2: ప్రత్యేక హోదా విషయం ఆంధ్ర రాజకీయాలలో కాక పుట్టిస్తోంది. బీజేపీని విమర్శిస్తూ కొంతమంది టీడీపీ ఎంపీలు మాట్లాడుతుంటే, మరికొందరు ఎంపీలేమో ఈ విషయంలో ఆచితూచి స్పందిస్తున్నారు. ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వదని, ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసని ఎంపీ జేసీ రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించగా, బీజేపీ నేత పురందేశ్వరి నిన్న మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం బీజేపీ కృషి చేస్తుందని తెలిపారు. తాజాగా సినీనటుడు, ఎంపీ మురళీమోహన్ ప్రత్యేక హోదా కోసం అవసరమైతే రాజీనామా చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితిలో బీజేపీతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అందుకే ఏమీ మాట్లాడలేకపోతున్నామని అన్నారు. రాజమండ్రిని వారసత్వ నగరంగా గుర్తించాలని కేంద్రాన్ని ఆయన కోరారు. కేవలం జగన్ దీక్ష చేసేది తన కేసులను మాఫీ చేసుకోవడానికేనని మురళీమోహన్ విమర్శించారు.