163 మంది భారత జాలర్లను విడుదల చేసిన పాక్

Posted On:02-08-2015
No.Of Views:294

హైదరాబాద్: పాక్ చెరలో ఉన్న 163 మంది భారతీయ జాలర్లకు విముక్తి కలిగింది. పాకిస్థాన్ జైళ్లలో ఉన్న 163 మంది భారతీయ మత్సకారులను ఆ దేశం విడుదల చేసింది. వాఘా సరిహద్దు వద్ద వారిని భారత భద్రతా అధికారులకు అప్పగించారు. ఇటీవల రష్యాలో వూఫాలో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ జాలర్ల విడుదలపై చర్చించారు. ఆ చర్చల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఇవాళ 11 ఏళ్ల బాలుడితో సహా 163 మందిని విడుదల చేశారు.