పోర్న్ సైట్లపై బ్యాన్ తాలిబానిజం: మిలింద్ దేవ్‌రా

Posted On:03-08-2015
No.Of Views:310

 పోర్న్ సైట్లపై ప్రభుత్వ బ్యాన్ తాలిబానిజానికి నిదర్శనమని కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవ్‌రా ట్విటర్‌ ద్వారా విమర్శించారు. కేంద్రం తాజాగా 857 అశ్లీల సైట్లను బ్లాక్ చేయాలంటూ ఇంటర్‌నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను కేంద్రం హరిస్తోందని మిలింద్ దేవ్‌రా మండిపడ్డారు. ఫోన్లు, టీవీలను కూడా బ్యాన్ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. పోర్న్ వెబ్ సైట్లను ప్రభుత్వం బ్యాన్ చేయడంపై సోషల్ మీడియాలో ఓ వైపు చర్చ జరుగుతుండగా కేంద్ర మాజీ ఐటీ మంత్రి మిలింద్ దేవ్‌రా ట్విటర్‌ ద్వారా తన ఆక్రోశాన్ని వెల్లగక్కారు.