నాగా వేర్పాటువాద గ్రూప్‌తో కేంద్రం శాంతి ఒప్పందం: ప్రధాని మోదీ

Posted On:03-08-2015
No.Of Views:220

 నాగాలాండ్‌లోని వేర్పాటువాద గ్రూప్‌తో కేంద్ర ప్రభుత్వం సోమవారం శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్‌ఎస్‌సీఎస్‌ (ఐ.ఎం.)తో భారత్‌ సుదీర్షకాలం చర్చలు జరిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ఐజాక్‌ మొయివా, భారత ప్రభుత్వ అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భగా మోదీ మాట్లాడుతూ 18 నెలల్లో ఒప్పందం అమలు అవుతుందని వెల్లడించారు. ఆరు దశాబ్దాల శాంతికి ముగింపు పలికామని చెప్పారు. రెండు దశాబ్దాల పాటు కాల్పుల విరమణ పాటించినందుకు నాగా గ్రూప్‌లకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన అన్నారు. ఈ ఘటన ఈశాన్య రాష్ర్టాల చరిత్రలో సరికొత్త అధ్యాయమని మోదీ అభివర్ణించారు. 
ఐజాక్‌ మొయివా మాట్లాడుతూ మాజీ ప్రధాని దివంగిత పీవీ నరసింహరావు హయాంలో తిరుగుబాటు దారులతో చర్చలు జరపాలన్న నిర్ణయం జరిగిందని అన్నారు. తిరుగుబాటు దారులతో చర్చలు జరపాలన్న గొప్ప నిర్ణయం పీవీదేనని ఆయన కొనియాడారు. నాగాలకు తగిన గౌరవం ఇవ్వాలన్న వాజ్‌పేయి నిర్ణయాన్ని ఆ రోజు మేం స్వాగతించామని మొయివా ఈ సందర్భంగా గుర్తు చేశారు.