పాక్ వరదల్లో 116 మంది మృతి

Posted On:03-08-2015
No.Of Views:292

ఇస్లామాబాద్: పొరుగు దేశం పాకిస్తాన్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో 116 మంది మరణించినట్లు సమాచారం. వర్షాల కారణంగా వెల్లువెత్తిన వరదలు దాదాపు 8 లక్షల మందిపై ప్రభావం చూపినట్లు వార్తలు వస్తున్నాయి. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల్లో చాలా మంది చిక్కుకుపోగా, వారిని రక్షించడానికి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పాక్ ప్రభుత్వం ఆరు వందలకు పైగా సహాయక, వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది.