సుబ్బారావు సంతకంతోనే కరెన్సీ నోట్లు!

Posted On:03-08-2015
No.Of Views:305

న్యూఢిల్లీ: రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) మాజీ గవర్నర్ డి. సుబ్బారావు సంతకంతో కరెన్సీ నోట్లు ముద్రించిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. సుబ్బారావు. పదవీ విరమణ తర్వాత రఘురామ్ రాజన్ 2013 సెప్టెంబర్ లో ఆర్బీఐ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. 2014 జనవరి నుంచి రాజన్ సంతకంతో కరెన్సీ నోట్లు ముద్రించాలని ఆర్బీఐ అన్ని ముద్రణాలయాలకు ప్రకటన జారీ చేసింది.<br />మధ్యప్రదేశ్ లోని దెవాస్ ముద్రాణాలయం దీన్ని అమలు చేయడంలో అలసత్వం ప్రదర్శించింది. మాజీ గవర్నర్ సంతకంతోనే రెండు నెలల పాటు 22.6 కోట్ల నోట్లు ముద్రించింది. ఇందులో 20, 100, 500 నోట్లు ఉన్నాయి. వీటి విలువ రూ. 37 కోట్లు. కాగ్ నివేదికతో ఈ విషయం వెలుగు చూసింది. ఆర్బీఐ కార్యాలయాలు ఈ నోట్లను తిరస్కరించడంతో దెవాస్ ముద్రాణాలయం మేల్కోంది.