టాలీవుడ్ ప్రేక్షకులకు మహేశ్ బాబు గిఫ్ట్

Posted On:03-08-2015
No.Of Views:245

ప్రేక్షకులను ఎంజాయ్ చేయమంటూ మహేశ్ బాబు టాలీవుడ్ ప్రేక్షకులకు ఓ బహుమతి అందించాడు. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న శ్రీమంతుడు సినిమాలో ఓ పాటకు సంబంధించి 40 సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్ను యూట్యూబ్లో విడుదల చేశాడు. దాని లింకును మహేశ్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా విడుదల చేశాడు.దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే.. దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే అంటూ శ్రుతిహాసన్, మహేశ్బాబు మధ్య రొమాంటిక్గా సాగే ఈ పాటకు సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ అందించాడు. ఈ సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తన యూట్యూబ్ అకౌంటులో ఈ వీడియోను పోస్ట్ చేసింది. ప్రిన్స్ మహేశ్ బాబు ఈ సినిమాకు సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.