సెట్స్‌లో రామ్ చరణ్ హల్ చల్

Posted On:03-08-2015
No.Of Views:263

 మెగా పవర్ స్టార్ రామ్ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో బిజీగా గడుపుతున్నాడు. ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన షూటింగులో రామ్ చరణ్ సెట్లో సందడిగా గడిపారు. రామ్ చరణ్ తో పాటు డైరెక్టర్ శ్రీను వైట్ల, కృతి కర్భంద ఇతర టీం సభ్యులతో కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ సినిమా లైన్ ప్రొడ్యూసర్ దిల్బిర్ సింగ్ తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ....‘పార్టీ సూపర్ గా సాగింది. నేను, చరణ్, శ్రీను వైట్ల, క్రితి కర్బంద అంతా కలిసి ఫుల్ గా తెల్లవారు జామువరకు ఎంజాయ్ చేసాం. త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసి గ్రాండ్ పార్టీ చేసుకుంటాం' అంటూ ట్వీట్ చేసారు. సెట్స్‌లో చరణ్ అందరితో కలివిడిగా ఉంటూ చాలా సందడిగా గడుపుతున్నాడని, చరణ్ తో పాటు సెల్ఫీలు కూడా తీసుకున్నామంటూ యూనిట్ సభ్యులు సంబర పడిపోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు టైటిల్ ప్రకటించనున్నారు. రామ్ చరణ్ ఇందులో స్టంట్ మాస్టర్ గా కనిపించబోతున్నాడు. ‘మై నేమ్ ఈజ్ రాజు', ‘బ్రూస్ లీ' అనే టైటిల్స్ గతంలో వినిపించాయి. అయితే ఇటీవలే జివి ప్రకాష్ సినిమాకు ‘బ్రూస్ లీ' అనే టైటిల్ ప్రకటించారు. మరి రామ్ చరణ్ కు ఏ టైటిల్ పెడతారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.