చిరు`పవన్‌ మధ్య సఖ్యత లేనట్లే!

Posted On:21-08-2015
No.Of Views:284

చిరు ఇంట్లో పెరిగి, ఆయన కరుణతో సినీహీరో అయిన పవన్‌కళ్యాణ్‌ ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత దూరం పెంచుకున్నారు. ఎక్కడా ఒకరి గురించి ఒకరు మాట్లాడకపోవడం, మెగా ఫంక్షన్లలో పవన్‌ కనిపించకపోవడంతో ఈ దూరం మరింత పెరిగిందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఇద్దరూ మళ్లీ కవాల్సిన అవసరమొచ్చింది. అయినప్పటికీ మెగా బ్రదర్‌కు పవన్‌ దూరంగా ఉంటున్నారు. ఈ సందర్భమేమిటంటే చిరంజీవి తన షష్టిపూర్తి జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్‌ స్టార్లు తరలివస్తున్నారు. పవన్‌ తప్పకుండా వచ్చి అన్నయ్యకు శుభాకాంక్షు చెబుతారని అందరూ భావించారు. కానీ పవన్‌ రావడం లేదని చిరే తేల్చి చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ మెగా స్టార్లల్లో అందరూ వేరు, పవన్‌ వేరని చెప్పడంతో తమ మధ్యనున్న ఎడం ఏమిటో తెలిసిపోతూనే ఉంది. ఇలా అయితే మెగాబ్రదర్స్‌ ఇప్పట్లో కలిసేటట్లు కనిపించడం లేదన్నది టాలీవుడ్‌ టాక్‌.