శ్రీమంతుడి ప్లాన్‌ ఏమిటి?

Posted On:22-08-2015
No.Of Views:277

సచిన్‌ టెండ్కూర్‌ ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత సెబ్రెటీల్లో చిన్నకుదుపు కలిగింది. అదేమిటంటే తామూ ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఉద్ధరించాన్న ఆలోచన కలిగింది. ఇది ఒకందుకు మంచిదే. సూపర్‌స్టార్‌ కృష్ణ వారసత్వంగా వచ్చిన నటనతోపాటు సేవాగుణాన్ని అవర్చుకున్న ప్రిన్స్‌ మహేష్‌బాబు ఒక్కసారే టాలీవుడ్‌ను చర్చల్లోకి తీసుకెళ్లారు. ఎపి,తెంగాణరాష్ట్రాల్లో ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని శ్రీమంతుడు సక్సెస్‌,థాంక్స్‌ మీట్‌లో ప్రకటించారు.
 తెంగాణ సీఎం కుమారుడు కెటిఆర్‌ సూచన మేరకు మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఒక కుగ్రామం, చంద్రబాబు సూచనతో కృష్ణా జిల్లా బుర్రిపాలెం గ్రామాను దత్తత తీసుకొనేందుకు ఆసక్తి చూపారు. అయితే కృష్ణ స్వగ్రామం బుర్రిపాలెంలో ఇప్పటికే ఆయన చాలా అభివృద్ధి సాధించారు. కృష్ణ తల్లి నాగరత్నమ్మ ఆ గ్రామానికి సర్పంచ్‌గా ఉండి ఎంతో అభివృద్ధి సాధించారు. ఆ తర్వాత ఆ గ్రామ అభివృద్ధి బాధ్యతను కృష్ణ స్వీకరించారు. ఇప్పుడు 70పై ఒడిలో పడిన కృష్ణ ఈ కార్యక్రమాను పర్యవేక్షించలేక మహేష్‌కు అప్పగించారు. దీనితో పాటు పామూరుజిల్లా సరిహద్దుల్లో ఉన్న అమ్రాబాద్‌ మండంలోని ఒక గిరిజన గ్రామాన్ని దత్తత తీసుకునే అవకాశాున్నట్లు వినిపిస్తోంది. ఇప్పటికే పామూరు జిల్లా కలెక్టర్‌ టి.కె శ్రీదేవి ఏ గ్రామాన్ని దత్తత గ్రామంగా ఎంపిక చేయాలా అన్నదానిపై తమునకలైనట్లు తొస్తోంది. దీన్ని అలా పక్కనుంచితే మహేష్‌ ప్రకటనతో టాలీవుడ్‌ హీరోల్లో కదలిక వచ్చింది. మిగతా వారు కూడా తమ తమ స్వగ్రామాను అభివృద్ధి చేసుకునేందుకు ముందుకు వచ్చినట్లు వినిపిస్తోంది. ఇదే జరిగితే గ్రామాు కొన్ని అభివృద్ధి పథంలోకి వస్తాయి.
ఈ ఒరవడిని ఎన్టీఆర్‌,ఏఎన్నార్‌,కృష్ణ ఎప్పుడో ప్రారంభించారు. ఎన్టీఆర్‌ నిమ్మకూరులో ఎంతో అభివృద్ధి సాధించారు. ఏఎన్నార్‌ గుడివాడలో కళాశాకు నిధులిచ్చారు. ఇప్పుడు ఆ కళాశా అక్కినేని నాగేశ్వరరావు కళాశాగా పిువబడుతుంది. విద్యాసంస్థకు ఆయన ఎన్నోనిధులిచ్చారు. ఇక సేవాతత్పరతలో కృష్ణ అందరికన్నా పైచేయే. విరాళాకు ఆయన చేతికి ఎముకుండదు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని టాలీవుడ్‌ హీరోు, నటు గ్రామాను దత్తత తీసుకుంటే గ్రామీణ ప్రపంచమే మారిపోతుంది.