యాదాద్రిలో ముస్లిం గోడు

Posted On:22-08-2015
No.Of Views:407

యాదాద్రి: హైదరాబాద్‌కు కూతవేటుదూరంలో ఉన్నయాదాద్రి అభివృద్ధి కెసిఆర్‌ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. మరో తిరుమలాగా బాసిల్లే విధంగా కోట్లాది రూపాయతో మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించి, అము చేస్తోంది. దీనిలో భాగంగా బస్టాండును మూసేసి, చుట్టూ ఉన్న దుకాణ సముదాయాను కూల్చేసి, వ్యాపారుకు వేరే చోట నిర్మించి ఇవ్వాని దేవాదాయ శాఖ ఆలోచన. ఈ మేరకు దుకాణాను కూల్చేసింది. ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడిరది. ఈ దుకాణాు కోల్పోయిన వారిలో ఇద్దరు ముస్లిరు కూడా ఉన్నారు. వారు మూడు దశాబ్ధాుగా ఇక్కడ భక్తుకు కావాల్సిన పూజాసామాగ్రి అమ్ముతూ స్వామి వారి సేవలో ఉన్నారు. అయితే దుకాణాు కోల్పోయిన వారికి ఇప్పటికే నిర్మించి ఉన్న 58 దుకాణాను అప్పగించారు. షేక్‌ జాఫర్‌,గౌస్‌ు ముస్లింనే సాకుతో వారికి దుకాణాను ఇవ్వలేదు. 
కారణమేమిటి? ఈ షాపున్న స్థం దేవాదాయ శాఖ పరిధిలోనిది. అందువల్లే అన్యమతస్తుకు ఇవ్వలేమని ఆ శాఖ కరాఖండిగా చెబుతోంది.ఇది సరే..మరి ఆ ఇద్దరు చిరు వ్యాపారుకు నష్టపరిహారం చెల్లిస్తే సరిపోయేది కదా అన్న ప్రశ్ను  ఎదురవుతున్నాయి.
గౌస్‌,జాఫర్లు ఇద్దరూ వాస్తవానికి మోటార్‌ మెకానిక్‌ు. వారు ఇక్కడి పెద్ద ఎత్తున వచ్చే భక్తుకు పూజాసామాగ్రి అందించేందుకు తమ మోటార్‌ మెకానిక్‌ షెడ్లను ఎత్తేసి,పూజాసామాగ్రి అమ్మే దుకాణాు పెట్టుకున్నారు. ఇప్పుడు వాటిని కూల్చేడంతో తమకు ఉపాధి ఎలా అని వారిద్దరూ ప్రశ్నిస్తున్నారు.
యాదాద్రి ఆయ ఎగ్జిక్యూటివ్‌ గీతారెడ్డిని వారు కలిసి తమకు న్యాయంచేయమని కోరగా, జాబితాలో మీ పేరు లేదు..తానేమీ చేయగనని నిస్సహాయతను వ్యక్తపరిచారు. అయితే దీనికి ప్రత్యామ్నాయ చర్యు తీసుకోవాని తాము కోరినా ప్రభుత్వ ఉత్తర్వును ఉ్లంఘించలేనని ఆమె కరాఖండిగా చెప్పారని వీరు వాపోయారు.
అయితే నష్టపరిహారం చెల్లించే విషయంలో సర్కార్‌తో మాట్లాడుతానని చెబుతున్న ఎగ్జిక్యూటివ్‌ అధికారి, వీరి ప్రత్యామ్నయ స్థలాన్ని చూపించలేకపోతున్నారు.
 తనకు నష్టపరిహారం, ప్రత్యామ్నయం చూపకపోతే ఆత్మహత్య చేసుకుంటామని జాఫర్‌ చెబుతున్నారు. ముప్పయి ఏళ్లుగా భక్తుకు పూజాసామాగ్రి అమ్ముతుంటే రాని మత సమస్య, ఇప్పుడు ఉపాధి దగ్గరఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నిస్తున్నారు.
వ్యాపారానికి కుమతాుండవని, తమ మతం వేరైనా స్వామివారికి సేవ చేస్తున్నామని వారుచెప్పారు.