రోడ్డుపై మద్యం ఏరులై పారింది..

Posted On:08-09-2015
No.Of Views:282

    కోయంబత్తూర్: లిక్కర్ లోడ్‌తో వెళ్తోన్న లారీ బోల్తాపడటంతో మద్యం అక్కడ ఏరులై ప్రవహించింది. ఈ ఘటన తమిళనాడు లోని కోయంబత్తూరు సమీపంలో సులూర్ పట్టణం వెలుపల మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నరసింహపలాయంలో తయారైన స్వదేశీ మద్యం(ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్) బాటిల్స్‌ను రాజధాని చెన్నైకి రవాణా చేస్తుండగా సులూర్ దగ్గర లారీ అదుపుతప్పి బోల్తాపడింది.
     లారీలో ఉన్న లోడ్ రోడ్డుపై పడి బాటిల్స్ చాలా మేరకు ధ్వంసమయ్యాయి. దీంతో మద్యం రోడ్డుపై ఏరులై పారింది. ఎలక్ట్రిక్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగి ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. లారీ డ్రైవర్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి. అతడిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. నష్టం వివరాలు ఎంత అనేది అంచనా వేసే పనిలో పోలీసులు ఉన్నారు.