విమానం కూలితే.. సెల్ఫీ తీసుకున్న పోలీసులు

Posted On:08-09-2015
No.Of Views:252

లండన్: విమాన ప్రమాదం జరిగి 11 మంది మరణిస్తే.. అక్కడకు వెళ్లిన ఇద్దరు యువ పోలీసు ఆఫీసర్లు అక్కడ జరగాల్సింది చూడకుండా.. వెళ్లి సెల్ఫీలు తీసుకున్నారు! దీనిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన లండన్లో జరిగింది. వీళ్లిద్దరూ బ్రిటిష్ పోలీసు విభాగంలో కొత్తగా చేరారు. విమానం కూలిన ప్రాంతానికి కొద్ది దూరంలో వాళ్లు కార్డన్ సెర్చ్ చేయాల్సి ఉంది. అయితే, ఆ పని చేయకుండా వెళ్లి కూలిన విమానం సమీపంలో సెల్ఫీలు తీసుకున్నారు. విమాన ప్రమాదంలో మరణించిన వాళ్ల బంధువులు ఈ విషయం తెలిసి చాలా బాధపడ్డారు. వాస్తవానికి ప్రమాదంలో మరో 16 మంది గాయడపడ్డారు కూడా. దాంతో బాధితులందరికీ పోలీసు విభాగం క్షమాపణలు చెప్పింది. ఫొటోలు తీసుకున్నవాళ్లు వాటిని తమ సహోద్యోగులకు సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయడంతో విషయం బయటకు వచ్చింది.