మహీంద్రా నుంచి ‘415 డీఐ’ ట్రాక్టర్

Posted On:08-09-2015
No.Of Views:251

హైదరాబాద్: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా.. 40 హెచ్పీ విభాగంలో 415 డీఐ మోడల్ ట్రాక్టర్ను విడుదల చేసింది. 4 సిలిండర్ ఇంజన్ను దీనికి పొందుపరిచారు. 158 ఎన్ఎం టార్క్ కలిగి ఉండడం 40 హెచ్పీ విభాగంలో ఇదే తొలిసారి. బ్యాకప్ టార్క్ 18 శాతముంది. 1,500 కేజీల బరువును ఇది లేపగలదు. మొత్తం ట్రాక్టర్ బరువు 1,785 కిలోలు. అధిక శక్తి, విభిన్న అప్లికేషన్లపై పనిచేయడం, ఉత్తమ ఇంధన సామర్థ్యం అనే మూడు అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ ట్రాక్టర్ను అభివృద్ధి చేశామని మహీంద్రా మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ రవీంద్ర శహానే ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.