కొరియర్ బోయ్ కళ్యాణ్ ట్రైలర్ విడుదల

Posted On:08-09-2015
No.Of Views:285

ఒక వైపు నిర్మాతగా.. మరోవైపు హీరోగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు నితిన్. తాజా నితిన్ హీరోగా నటిస్తున్న కొరియర్ బోయ్ కళ్యాణ్ సినిమా ట్రైలర్ మంగళవారం సాయంత్రం విడుదలైంది. మహేశ్బాబు శ్రీమంతుడు సినిమాతో స్ఫూర్తి పొందాడో ఏమో గానీ.. ఈ సినిమాలో నితిన్ కూడా సైకిల్ తొక్కాడు. హీరోయిన్ యామీ గౌతమ్ తన స్నేహితురాళ్లతో కలిసి ఆటోలో వెళ్తుండగా ఈ సైకిల్ తొక్కే సీన్ ఉంటుంది.  ఎంట్రీలో నితిన్ చేతిలో ఓ కవర్ పట్టుకుని పరుగు పెడుతూ కనిపిస్తాడు. అతడిని ఓ నలుగురు వెంబడిస్తారు. తర్వాత విదేశాల్లో ఆస్పత్రి కేంద్రంగా జరిగే అక్రమం, ఆ తర్వాత అవినీతిపై పోరాడుతున్నట్లుగా కనిపించే నాజర్, ఇలాంటి సన్నివేశాలన్నీ ఉంటాయి. ఈ సినిమాకు కార్తీక్, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. గౌతమ్ మీనన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రేమ్సాయి దర్శకత్వం వహిస్తున్నారు.