ఐఎస్‌ఎస్ వ్యోమగాములకు రోబో పాఠాలు

Posted On:09-09-2015
No.Of Views:287

లండన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోని శాస్త్రవేత్తలు ఆరునెలలకోసారి మారిపోతుంటారు. అంటే, కొత్త వారు అక్కడికి చేరుకోగానే అందులోని వారు భూమికి తిరిగివస్తుంటారు. మరి, కొత్తగా ఐఎస్ఎస్లోకి వచ్చిన వారికి అవసరమైన సమాచారం ఎవరందిస్తారు? ఐఎస్ఎస్లో ఒక రోబో ఉంది. ఈ రోబో స్వీయచరిత్రను గుర్తుంచుకునే వ్యవస్థ(ఆటోబయోగ్రాఫికల్ మెమరీ)ను ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఐఎస్ఎస్లోని సైంటిస్టులు భౌతిక ప్రదర్శనలు, వాయిస్ కమాండ్ల ద్వారా చెప్పే పాఠాలను ఆటోబయోగ్రాఫికల్ మెమరీ సాయంతో రోబో గుర్తుంచుకుంటుంది. అవసరమైనపుడు అదే సమాచారాన్ని సైంటిస్టులకు వివరిస్తుంది.