కేంద్ర వైద్యమంత్రికి ఇచ్చిన వాటర్ బాటిల్‌లో పాముపిల్ల

Posted On:10-09-2015
No.Of Views:278

 కేంద్ర వైద్యమంత్రి జెపి నద్దాకు, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌కు ఇచ్చిన వాటర్‌ బాటిల్‌లో పాము పిల్ల వచ్చింది. రాయ్‌పూర్‌లోని బిజెపి కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. రమణ్ సింగ్‌ మెడికల్ టీంలోని ఓ మహిళా డాక్టర్ ఈ పాము పిల్లను గుర్తించారు. వాటర్ బాటిల్‌‌పై అమన్ అక్వా అని ఉంది. అమన్ అక్వా కంపెనీ బిజెపి మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు సయ్యద్ అలీ అమన్‌ది. తన బిజినెస్‌ను, ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎవరో కుట్ర పన్నారని అమన్ ఆరోపించారు. ఎటువంటి తనిఖీలు జరపకుండా వాటర్ బాటిల్‌ను ఎలా తీసుకొచ్చారనేదానిపై విచారణ జరుగుతోంది.