హైదరాబాద్లో ఇక ఎల్ఈడీ టీవీల తయారీ!

Posted On:10-09-2015
No.Of Views:280

హైదరాబాద్ నగరంలో ఎల్ఈడీ టీవీల తయారీకి రంగం సిద్ధమైంది. చైనాకు చెందిన మాకేనా అనే సంస్థ ఇక్కడ తమ ప్లాంటును నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, మాకేనా సంస్థల మధ్య ఓ అవగాహన ఒప్పందం కుదిరింది.  అలాగే, చైనాలోని షాంఘై ఎలక్ట్రిక్ కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్ శావోతో కూడా సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఎలక్ట్రిక్ పరికరాల తయారీ యూనిట్ను తెలంగాణలో ఏదో ఒక ప్రాంతంలో నెలకొల్పేందుకు షాంఘై ఎలక్ట్రిక్ కార్పొరేషన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. సానుకూల స్పందనలు వస్తుండటంతో.. షాంఘై నగరం నుంచి వ్యాపారుల బృందం ఒకటి వచ్చి హైదరాబాద్లో పర్యటించాలని సీఎం కేసీఆర్ బృందం ఆహ్వానించింది.