తమన్నాను కలవరపెడుతోన్న శ్రుతి!

Posted On:10-09-2015
No.Of Views:312

తెలుగు తెరపై అందమంటే తమన్నాదేనని కుర్రకారు ప్రేక్షకులు భావిస్తూ వస్తున్నారు. మేని ఛాయతోను .. అభినయంతోను ఆమె ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేస్తూ అనతికాలంలోనే అగ్రస్థానానికి చేరుకుంది. తెలుగులోనే కాదు .. తమిళ .. హిందీ భాషా ప్రేక్షకులను కట్టిపడేసే ప్రయత్నాలు చేస్తూనే వుంది. అయితే హిందీ సినిమాల కోసం తెలుగులో ఆమె ఇచ్చిన కాస్త గ్యాప్ లోకి రకుల్ చొరబడిపోయి వరుస అవకాశాలను సొంతం చేసుకుంది.ఒకే ఒక్క స్మైల్ తో రకుల్ యూత్ హృదయాలను మంత్రించి వేసింది. అయినా ఫరవాలేదని తమన్నా అనుకుంటోన్న సమయంలోనే, శ్రుతిహాసన్ నుంచి ఆమెకి మరింత గట్టి పోటీ ఎదురవుతోందని అంటున్నారు. తెలుగులో 'శ్రీమంతుడు' వంటి భారీ హిట్ ని సింపుల్ గా కొట్టేసిన శ్రుతి, టాలీవుడ్ దర్శక నిర్మాతలకి మొదటి ఆప్షన్ గా నిలిచింది. ఇక 'పులి' లోను విజయ్ జోడీగా శ్రుతి ఒక రేంజ్ లో అందాలు ఆరబోసిందట. ఈ సినిమా విడుదలైతే తమిళ్లో ఆమె జోరు మరింత స్పీడుగా కొనసాగుతుందని అనుకుంటున్నారు. తమిళ ప్రేక్షకులు కూడా గ్లామర్ విషయంలో శ్రుతికి ఎక్కువ మార్కులు ఇస్తూ ఉండటం, తమన్నాను కలవరపెడుతోందనే టాక్ వినిపిస్తోంది.