హీరోయిన్ లేకుండా హీరో సినిమా!

Posted On:10-09-2015
No.Of Views:319

తెలుగు .. తమిళ భాషా ప్రేక్షకులకి బాగా దగ్గరైన ఒక యువకథానాయకుడు, హీరోయిన్ లేకుండా తమిళ్లో ఒక సినిమాను రూపొందించాడు. ఒక రకంగా ప్రయోగం .. మరో రకంగా సాహసంగా చెప్పబడే ఈ ప్రయత్నానికి పూనుకున్న ఆ యువకథానాయకుడే సిద్ధార్థ్. తెలుగులో 'బొమ్మరిల్లు' తరువాత ఆ స్థాయి హిట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన సిద్ధార్థ్ కి, ఆశించిన ప్రయోజనం మాత్రం దక్కలేదు. దాంతో తమిళ సినిమాలకి పూర్తి సమయాన్ని కేటాయించి, ఈ మధ్య కొన్ని విజయాలను దక్కించుకున్నాడు. <br><br> అప్పుడప్పుడు నిర్మాతగా కూడా మారిపోయే ఈ కథానాయకుడు, తాను హీరోగా ఒక సినిమాను నిర్మించాడు. ఈ సినిమాలో హీరోయిన్ ఉండదట. షూటింగు పూర్తిచేసుకున్న ఈ సినిమాపై సిద్ధార్థ్ మంచి నమ్మకంతో ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఒక్కో సినిమాలో కథానాయికల సంఖ్య పెరుగుతూ పోతుంటే, అసలు కథానాయిక లేకుండా సిద్ధార్థ్ సినిమా తీయడం చర్చనీయాంశమైంది. కథ లేకపోయినా ఫరవాలేదుగానీ .. నాయిక లేకపోతే ఎలా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.