విష్ణు కొత్త సినిమా మొదలు

Posted On:10-09-2015
No.Of Views:261

విష్ణు కథానాయకుడిగా కొత్త సినిమా షూటింగుకి ఈ రోజున శ్రీకారం చుట్టారు. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ ఉదయం హైదరాబాదు, రామానాయుడు స్టూడియోలో జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి కె.రాఘవేంద్రరావు క్లాప్ కొట్టగా .. జెమిని కిరణ్ స్విచ్ ఆన్ చేయగా .. బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. శ్రీవెంకటేశ్వర ఫిల్మ్స్ బ్యానర్ పై కుమార్ - కేశవరావు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి కార్తీక్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. లవ్ .. సెంటిమెంట్ .. యాక్షన్ సమపాళ్లలో కలిసిన కథగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విష్ణు జోడీగా సోనారిక నటిస్తోంది. రేపటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.