ముగ్గురు మరదళ్లతో మహేష్ సందడి!

Posted On:10-09-2015
No.Of Views:254

'బ్రహ్మోత్సవం' షూటింగ్ ఈ నెల 16 నుంచి మొదలు కానుండటంతో, మహేష్ అభిమానులంతా ఈ సినిమా విశేషాలపై దృష్టి పెట్టారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో కాజల్ .. సమంతా .. ప్రణీత కథానాయికలుగా అలరించనున్నారు. అయితే కథాపరంగా ఈ ముగ్గురు ఎలాంటి సందర్భాల్లో మహేష్ కి పరిచయం అవుతారనే ఆసక్తి అభిమానుల్లో ఉంది.<br><br> తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం, ఈ ముగ్గురు కథానాయికలు మహేష్ మేనత్త కూతుళ్లుగా నటిస్తున్నారట. మహేష్ ఫ్యామిలీ .. ముగ్గురు మేనత్తల కుటుంబాలు .. ముగ్గురు మరదళ్లు మహేష్ పట్ల చూపే ప్రేమానురాగాలతో ఈ కథ కొనసాగుతుందట. అందువల్లనే ఈ సినిమాలో భారీతారాగణం కనిపిస్తోంది. కథాపరంగా ఈ సినిమా విజయవాడ నేపథ్యంలో మొదలై .. తిరుపతి నేపథ్యంలో ముగుస్తుందట. ముగ్గురు మరదళ్లతో మహేష్ సందడి చేయనున్నాడనే విషయం ఒక్కటి చాలు, ఈ సినిమాపై ఆసక్తి పెంచడానికి .. ఆతృత కలిగించడానికి.