సమంతా కొత్తకారు ముచ్చట

Posted On:10-09-2015
No.Of Views:326

కలను నిజం చేసుకోవాలనే కోరిక .. ముచ్చట తీర్చుకోవాలనే ఆతృత ప్రతి ఒక్కరికీ ఉంటాయి. తాజాగా అలాంటి కలను సమంతా నిజం చేసుకుంది. తనకి ఎంతో ఇష్టమైన బి ఎమ్ డబ్ల్యూ ఎక్స్ 5 మోడల్ కారును కొనుగోలు చేసింది. హైదరాబాద్ - ఖైరతాబాద్ లోని ఆర్టీ ఏ కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంది.<br><br> టాలీవుడ్లో సమంతా పేరు సక్సెస్ కి చిరునామాగా చెబుతుంటారు. అగ్రకథానాయిక స్థానంలో కొనసాగుతోన్న సమంతాకి అభిమానుల సంఖ్య ఎక్కువగానే వుంది. అలాంటి సమంతాకి బి ఎమ్ డబ్య్లూ కారంటే చాలా ఇష్టమట. చాలాకాలం నుంచి ఆమె ఈ కారు కొనుక్కోవాలని ముచ్చట పడుతోంది. 76.41 లక్షల ఖరీదు గల ఈ కారును ఆమె కొనుగులు చేసి తన ముచ్చట తీర్చుకుంది.