కారు ప్రమాదంలో యువహీరోకు తీవ్రగాయాలు

Posted On:12-09-2015
No.Of Views:310

మళయాళ చిత్ర పరిశ్రమలోని యువ నటుడు, దర్శకుడు సిద్ధార్థ భరతన్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం తెల్లవారుజామున ఆయన వెళ్తున్న కారు రోడ్డు పక్కనున్న ఓ గోడను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో చంపక్కర వద్ద జరిగిన ఈ ప్రమాదంలో సిద్దార్థ తలకు తీవ్రగాయమైంది. ఆయనను కొచ్చిలోని మెడికల్ ట్రస్టు ఆస్పత్రిలో చేర్చారు.  ఆయన పరిస్థితి విషమంగా ఉన్నా.. స్థిరంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రముఖ మళయాళ దర్శకుడు భరతన్, నటి కేపీఏసీ లలితల కుమారుడే సిద్దార్థ. నటులు మమ్ముట్టి, దిలీప్ తదితరులు ఆస్పత్రికి వెళ్లి ఆయనను చూసివచ్చారు. ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, హోం మంత్రి రమేష్ చెన్నితాల ఆస్పత్రికి ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. సిద్దార్థ దర్శకత్వంలో ఈ ఏడాది మొదట్లో దిలీప్ హీరోగా వచ్చిన చంద్రెట్టన్ ఎవిడెయ అనే సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది.