టీనేజ్ లవర్స్ ను ఆకట్టుకునే సాంగ్!

Posted On:12-09-2015
No.Of Views:292

టీనేజ్ లవ్ స్టోరీస్ లో పాటలు చూపించే ప్రభావం ఎక్కువ. అందువల్లనే ఆ తరహా సినిమాల్లో లవర్స్ మధ్య పాటలు అందంగా .. అనుభూతి ప్రధానంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి అనుభూతిని అందించే సాంగ్ ను అన్నపూర్ణ స్టూడియోస్ వారు సోషల్ మీడియా పేజ్ ద్వారా తాజాగా విడుదల చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా 'నిర్మలా కాన్వెంట్' చిత్రాన్ని నాగార్జున నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. రోషన్ - శ్రేయాశర్మ జంటగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి ఒక సాంగును విడుదల చేశారు. '' ఒక్కోసారి ఓ ముద్దు .. ఒక్కోచోట ఓ ముద్దు '' అంటూ సాగే ఈ పాట చాలా బాగుంది. ముద్దులో అర్థాన్నీ .. అనుభూతిని అందంగా ఆవిష్కరించిన తీరు యూత్ ని ఆకట్టుకునేలా వుంది. విజువల్స్ లేకుండా కలర్స్ ఫ్రేమ్ లో ఆవిష్కరించిన ఈ పాటను చూస్తూ .. విజువల్స్ ను ఊహించుకునేలా ఉంది. ఈ సినిమాకి సంగీతాన్ని అందించిన కోటీ కుమారుడికి మంచి భవిష్యత్ ఉందనే విషయాన్ని ఈ పాట చెప్పకనే చెబుతోంది.