సమంతా అలా సెలవిచ్చింది!

Posted On:12-09-2015
No.Of Views:312

తెలుగు .. తమిళ సినిమాలతో సమంతా చాలా బిజీగా వుంది. ప్రస్తుతం ఆమె 'బెంగుళూర్ డేస్' షూటింగులో పాల్గొంటోంది. మలయాళ చిత్రంగా వచ్చిన 'బెంగుళూర్ డేస్' అక్కడ అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. ఆ సినిమాలో దుల్కర్ సల్మాన్ - నిత్యామీనన్ కూడా ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఆ సినిమాను తెలుగు .. తమిళ భాషల్లో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నాడు.<br><br> మలయాళలో నిత్యామీనన్ చేసిన పాత్రను సమంతా పోషిస్తోంది. మిగతా పాత్రలను రానా .. ఆర్య .. బాబీసింహా .. శ్రీదివ్య ధరిస్తున్నారు. ప్రస్తుతం రానా .. సమంతా కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ సమయంలో రానాతో దిగిన ఫోటోను ఆమె తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. హైటు విషయంలో ఇద్దరికీ పొంతన లేదనుకుంటారని అనుకుందో ఏమో, ప్రేమ పుట్టడానికి సైజులు .. షేపులు అడ్డుకాదంటూ సరదాగా ఓ కామెంటును వదిలింది.