అలా ఆమెకి చాన్స్ దక్కిందట!

Posted On:12-09-2015
No.Of Views:301

తెలుగు ప్రేక్షకులను త్వరలో ఒక నూతన కథానాయిక పలకరించనుంది .. ఆమె పేరే 'ప్రగ్యా జైస్వాల్'. వచ్చేనెలలో విడుదల కానున్న 'కంచె' సినిమాలో ఆమె వరుణ్ తేజ్ జోడీగా నటించింది. ఈ సినిమాలో తనకి చాన్స్ ఎలా వచ్చిందనే విషయాన్ని ఆమె చెప్పింది. హిందీలో 'గబ్బర్ ఈజ్ బ్యాక్' సినిమాకి గాను దర్శకుడు క్రిష్ కథానాయిక కోసం ఆడిషన్స్ నిర్వహించాడు. ఆ ఆడిషన్స్ లో ప్రగ్యా జైస్వాల్ కూడా పాల్గొంది.ప్రగ్యా జైస్వాల్ లో కథానాయిక లక్షణాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, ఆ సినిమాలో చాన్స్ శ్రుతిహాసన్ కి వెళ్లింది. ఇక ఆ తరువాత క్రిష్ 'కంచె' సినిమా కోసం కథానాయికలను అన్వేషించాలని అనుకున్నప్పుడు ఈ అమ్మాయి గుర్తుకు వచ్చిందట. అంతే, ఆమెని పిలిపించి కథానాయికగా ఎంపిక చేశాడు. అలా ఈ సినిమాలో హీరోయిన్ అయిపోయిన ప్రగ్యా, కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందుతాననే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.