ఊరి చివర ఇల్లు

Posted On:13-09-2015
No.Of Views:276

ఆ ఊళ్లో అందరూ ఒక ఇల్లంటే భయపడతారు. అదే శ్రీ నిలయం. ఎందుకంటే ఆ ఇంట్లో మనుషులుండరు. ఆ ఇంటి వెనకచరిత్ర ఏంటనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం శ్రీ నిలయం యోగేశ్, నేహా దేశ్పాండే జంటగా సురేశ్ దర్శకత్వంలో సూర్యనారాయణ నల్లూరి, హేమంత్ నల్లూరి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. దర్శక నిర్మాతలు మాట్లాడుతూ- ప్రేక్షకులను థ్రిల్కు గురి చేసే అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించాం. కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుందిఅని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: కుంచాల ఆంజనేయులు, ఎడిటర్: శ్రీ.