ఐష్ ఎందుకు ఏడ్చారు?

Posted On:13-09-2015
No.Of Views:339

    ఎప్పటిలానేఆ రోజు ఐశ్వర్యా రాయ్ షూటింగ్కి వెళ్లారు. రోజంతా షూటింగ్ చేసి, సాయంత్రం దర్శకుడు పేకప్అని చెప్పగానే అమాంతంగా ఏడ్చేశారామె. స్టార్ హీరోయిన్, అందులోనూ అందాల సుందరి అలా కంట తడిపెట్టుకోవడంతో జజ్బాచిత్రబృందం కంగారుపడింది. దాదాపు నాలుగైదేళ్ల విరామం తర్వాత ఐష్ కథానాయికగా నటించిన చిత్రం ఇది. సంజయ్ గుప్తా దర్శకత్వంలో ఐశ్యర్యా రాయ్ నటించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. చివరి రోజున ఐష్ ఎమోషనల్ అయ్యారు. ఇన్నాళ్లూ ఈ చిత్రబృందంతో చేసిన ప్రయాణానికి ఫుల్స్టాప్ పడిందని తెగ ఫీలైపోయారు. కంట తడిపెట్టుకున్నారు. బాధ తట్టుకోలేక పక్కనే ఉన్న మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ కాంట్రాక్టర్ని హగ్ చేసుకున్నారు. మిక్కీ కూడా కంట తడిపెట్టుకున్నారు. ఈ ఇద్దరి బాధ చూడలేక కొంతమంది యూనిట్ సభ్యులు కూడా ఏడ్చారు.
     ఇంతగా అందరూ కదిలిపోయారంటే.. ఈ చిత్రం షూటింగ్ వాళ్లకి ఎంతటి మంచి అనుభూతిని మిగిల్చి ఉంటుందో ఊహించవచ్చు. మొత్తం 51 రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేశాం. ప్లాన్ చేసిన ప్రకారమే షూటింగ్ కంప్లీట్ కావడం ఆనందంగా ఉందిఅని సంజయ్ గుప్తా పేర్కొన్నారు.