రూ. 44కే ఎల్‌ఈడీ బల్బు!

Posted On:13-09-2015
No.Of Views:258

న్యూఢిల్లీ: ఎల్ఈడీ బల్బును రూ. 44కే అమ్మాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో సుమారు రూ. 300 గా ఉన్న ఎల్ఈడీ బల్బును డొమెస్టిక్ ఎఫిషియంట్ లైటింగ్ ప్రోగ్రామ్(డెల్ప్) పథకం కింద రూ. 44కే విక్రయించి.. ప్రజలు సామర్థ్యం లేని నాసిరకం బల్బులను వినియోగించకుండా చేయాలన్నది యోచన. ఈ బల్బులను వేలంలో భారీగా కొనడం ఒక్కో బల్బును రూ. 44 కే విక్రయించాలని యోచిస్తున్నట్లు విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.  ప్రస్తుతం మార్కెట్లో ఈ బల్పుల ధర ఒక్కోటి రూ. 275-300గా ఉందన్నారు. వేలంలో దీని ధర రూ. 74 వరకు వచ్చిందని తెలిపారు. దీన్ని మరింత తగ్గించాలని యోచిస్తున్నామన్నారు. డెల్ప్ కింద ఎల్ఈడీ బల్బులను తీసుకొన్న వినియోగదారులు నెలవారీగానూ సొమ్ము చెల్లించవచ్చన్నారు. ఎల్ఈడీ బల్బుల వాడకం పెరిగితే విద్యుత్ వినియోగంలో 50 నుంచి 90 శాతం ఆదా అవుతుందన్నారు.