సముద్రంలో సొరంగ మార్గం..

Posted On:13-09-2015
No.Of Views:322

జలాంతర్గామిలో ప్రయాణించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు.. అలాంటి అనుభూతి పొందాలంటే మాత్రం డెన్మార్క్‌లోని ఓరిసండ్ బ్రిడ్జిపై ప్రయాణించాల్సిందే. డెన్మార్క్‌లోని కోపెన్హాగన్, స్వీడన్‌లోని మాల్మో నగరాన్ని కలిపే ఈ బ్రిడ్జి.. దాదాపు 8 కిలోమీటర్ల పొడవుంటుంది. ఇందులో సొరంగం మాదిరిగా దాదాపు 4 కిలోమీటర్ల మేర నీటి లోపలి నుంచి వెళుతుంది. టన్నెల్ ఉన్న చోట కృత్రిమ ద్వీపం కూడా ఏర్పాటు చేశారు. 2000 సంవత్సరంలో ప్రారంభించిన ఈ బ్రిడ్జ్రి డిజైన్‌ను డెన్మార్క్‌కు చెందిన జార్జ్ రాట్నే రూపొందించారు.