హీరో నితిన్ నిర్మాతగా జోరు

Posted On:15-09-2015
No.Of Views:308

యంగ్ హీరోనితిన్ నిర్మాతగా కూడా జోరు చూపిస్తున్నాడు. చాలా కాలం తరువాత హీరోగా సక్సెస్ అయిన నితిన్, ప్రస్తుతం నటన మీదే కాకుండా నిర్మాణ రంగం మీద కూడా దృష్టిపెడుతున్నాడు. ప్రస్తుతం అక్కినేని వారసుడు అఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఓ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కిస్తున్న నితిన్, త్వరలో తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా మరిన్ని సినిమాలకు రెడీ అవుతున్నాడు.
  తన బ్యానర్ ద్వారా స్ట్రయిట్ సినిమాలను ప్రొడ్యూస్ చేయటమే కాదు, డబ్బింగ్ సినిమాలను కూడా రిలీజ్ చేస్తున్నాడు నితిన్. ప్రజెంట్ సూర్య హీరోగా విక్రమ్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న 24 సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్‌ను భారీ మొత్తానికి సొంతం చేసుకున్నాడు. తెలుగులో సూర్య మార్కెట్ తో పాటు తనకు ఇష్క్ లాంటి బిగ్ హిట్ అందించిన విక్రమ్ కుమార్ మీద ఉన్న నమ్మకంతో 20 కోట్లు పెట్టి ఈ హక్కులు సొంతం చేసుకున్నాడట నితిన్.నిర్మాతగా కొనసాగుతూనే హీరోగా కూడా తన కెరీర్‌ను ముందుకు తీసుకెళుతున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈసినిమాకు అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫైనల్ చేశారు.. ఈ సినిమాలో తొలిసారిగా నితిన్ సరసన సమంత హీరోయిన్గా నటిస్తుండగా మళయాల సూపర్ హిట్ మూవీ ప్రేమమ్ ఫేం అనుపమ పరమేశ్వరన్ మరో ఇంపార్టెంట్ రోల్లో నటిస్తుంది.