అక్కడ వరకట్నం నిషేధం

Posted On:15-09-2015
No.Of Views:354

నిలంబూర్... కేరళలోని ఆ చిన్నపట్టణం.. జనాభా 45 వేలు.... 2009 లో మొదలైన ప్రయత్నం... ఒక్కో అడుగు... ఇపుడు నిలంబూర్ డౌరీ ఫ్రీ జోన్... పెళ్ళిళ్ళు కట్నకానుకలు లేకుండానే జరుగుతాయి. దేశంలోనే మొట్టమొదటి డౌరీ ఫ్రీ జోన్ గా గుర్తింపు పొందింది. అయితే అక్కడివారుఇది అంత సులభంగా సాధించిన విజయం మాత్రం కాదు... నిలంబూర్ మున్సిపాలిటీ, పలు స్వచ్ఛంద సంస్థలతో కలసి ఇందుకు తీవ్ర కృషి చేసింది. ఇప్పుడు దేశంలోనే ఓ గొప్ప పేరును సంపాదించుకుంది.   65 ఏళ్ళ మొహమ్మద్ రోజువారీ కార్మికుడు. ఆయన భార్య అరవైఏళ్ళ ఫాతిమా. ఈ దంపతులిద్దరికీ మొత్తం ఏడుగురు సంతానం. కేరళలోని నిలంబూర్ దగ్గరలోని ముస్లిం మెజారిటీ ప్రాంతంగా పేరొందిన చెరువత్తుకున్ను ప్రాంతం వీరిది. 2012 లో ఈ దంపతులు వారి ఇద్దరు కూతుళ్ళకు కొద్ది పాటి బంగారం కట్నంగా ఇచ్చి పెళ్ళిళ్ళు జరిపించారు. అయితే వీరి సంతానంలోని మరో ముగ్గురు కూతుళ్ళు (సాంజా, జశీలా, షమీలా) ఉన్నత విద్యను అభ్యసించి టీచర్ ట్రైనింగ్ కూడ పూర్తి చేశారు. అయితే వీరికి వివాహాలు చేసేందుకు మాత్రం మొహమ్మద్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. దినదినగండంగా సాగే తమవంటి వారి జీవితాల్లో వరకట్నం దురాచారం వేధించడాన్ని తలచుకొని కుమిలిపోయాడు. ఇది మహమ్మద్ ఒక్క కుటుంబ సమస్య కాదు.. మన దేశంలో ఎన్నో కుటుంబాలను పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య.<b అభివృద్ధిచెందుతున్న దేశాల సరసన ఉన్న ఇండియా వరకట్నం, బాల్య వివాహాల లెక్కల్లో మాత్రం వెనుకబడే ఉంది. అయితే కేరళలోని నిలంబూర్ మాత్రం దేశానికే ఓ స్ఫూర్తి దాయకంగా నిలుస్తోంది. డౌరీ ఫ్రీజోన్ గా మారి తన ప్రత్యేకతను చాటుకుంది. ఇళ్ళు లేని వారికోసం గణాంకాలను సేకరించేందుకు 2007 లో నిలంబూర్ లో నిర్వహించిన ఓ సర్వేలో నాల్గింట మూడొంతుల మంది ఇళ్ళు లేనివారే ఉన్నట్లు గుర్తించారు. వారంతా ఉన్న ఇళ్ళను, భూములను తమ కుమార్తెల వివాహాలకు తాకట్టు పెట్టి, నిరాశ్రయులుగా మారినట్లు సర్వేలో తేలింది. వీరంతా రుణాలకోసం పంచాయితీకి అర్జీ పెట్టుకున్నారు. దీంతో హెచ్ ఆర్డీ మంత్రిత్వ శాఖ...కేరళ మహిళా సమాఖ్య సమితి సహకారంతో మరో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భయంకరమైన నిజాలు వెలుగు చూశాయి. పంచాయితీ ప్రెసిడెంట్ ఆర్యదాన్ షౌఖత్ లెక్కల ప్రకారం ఒక్క నెలలోనే ఆ ప్రాంతంలో సుమారు అరవై పెళ్ళిళ్ళు జరిగాయని, ఇందుకు దాదాపు ఒక్కో పెళ్ళికి మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఖర్చయిందిన తేల్చారు. మొత్తం 45 వేలమంది జనాభా ఉన్న గ్రామంలో సుమారు వెయ్యి మంది పెళ్ళీడు వచ్చిన బాలికలు ఖర్చులు భరించలేక, కట్నాలు ఇవ్వలేక పెళ్ళి కాకుండా ఉండిపోయినట్లు, నలభై శాతం మహిళలు అనుకున్న విధంగాకట్నం ఇవ్వలేకపోవడంతో పెళ్ళి తర్వాత విడాకులు తీసుకొని తల్లిదండ్రులతోనే ఉంటున్నట్లు సర్వేలో తేలింది.ఇది చాలా నీచ సంస్కృతిగా తేల్చిన పంచాయితీ ప్రెసిడెంట్... ఈ దురాచారాన్ని రూపు మాపేందుకు&nbsp; కె ఎం ఎం ఎస్ సహాయంతో ప్రయత్నాలు ప్రారంభించారు. మహిళా సమాఖ్య ప్రతినిధి సెలీనా ఇందుకు నడుం బిగించారు. మలబార్ లోని కొన్ని గ్రామాల్లో అమల్లో ఉన్న మైసూర్ మేరేజ్ సిస్టమ్ అమల్లోకి తెచ్చేందుకు ఓ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సిస్టమ్ ప్రకారం ధనిక కుటుంబాల్లోని వరులు.. పేదింటి పిల్లలను వివాహం చేసుకునేందుకు ప్రోత్సహిహించారు.  2009 లో నిలంబూర్ ను పూర్తిగాకట్నంలేని గ్రామంగా చేసేందుకు ప్రతిజ్ఞ చేశారు. పురపాలక ఛైర్మన్ ఆర్యదాన్ షౌకత్ ఉద్యమాన్నిముందుండి నడిపించారు. స్థానికుల్లో కట్నం పట్ట ఇష్టం తగ్గించేందుకు అనేక అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం అనేకమంది మహిళలు, పురుషులు ఈ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని సమావేశాలు, డోర్ టు డోర్ ప్రచారాలు, వీధినాటకాలు, మోటివేషన్ తరగతులు నిర్వహించారు. కొన్ని సంఘాలను ఏర్పాటు చేసి ఇన్ఫార్మర్ల వ్యవస్థను కూడ ఏర్పాటు చేశారు. కట్నం తీసుకోవడం జీవితంలో పెద్ద నేరం అన్న నానుడితో అనేక స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో అవగాహన కల్పించాయి.మహిళా స్వయం సహాయక సంఘాలు శక్తివంతంగా మారాయి. గ్రామానికి కట్నం ఫ్రీ జోన్ గా నామకరణం చేసి ఊరి చివర్లో బోర్డును స్థాపించారు. కట్నం ఫ్రీ జోన్లక్ష్యాన్ని విజయవంతంగా సాధించిన అనంతరం గృహ హింస, ఇతర సామాజిక సమస్యలపై చర్చించడం మొదలు పెట్టారు కేరళ మహిళా సమాఖ్య సమితి ప్రతినిధి సెలీనా. సురక్షాపేరిట ఓ పథకాన్ని కూడ ప్రారంభించారు. వరకట్న బాధిత మహిళలకు ఓ పునరావాసంగా ఈ పథకం పనిచేస్తుంది.
  వారి కేసులపై పోరాడటానికి, వారి విద్య, ఆరోగ్యం కోసం ఆర్థిక సాయం అందించేందుకు సహాయపడుతోంది. అలాగే సమీక్షపేరిట మరో ప్రయత్నంతో గ్రామంలోని నిరక్షరాస్యులను విద్యావంతులుగా తీర్చి దిద్దే కార్యక్రమం కూడ సమాఖ్య చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామంలోని ప్రతివారూ కనీసం పదో క్లాసు పూర్తి చేసేట్టు శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు నిలంబూర్ దేశంలోనే కట్న రహిత, విద్యావంత గ్రామంగా ప్రసిద్ధి చెందింది.