గ్రాండ్‌స్లామ్‌పై జొకోదస్‌కత్

Posted On:15-09-2015
No.Of Views:318

అద్భుతమేమీ జరుగలేదు. అనుకున్నదే జరిగింది. గత వింబుల్డన్ ఫైనల్ ప్రత్యర్థుల మధ్య ఫలితమే పునరావృతమైంది. ఫెదరర్‌పై సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచే పైచేయి సాధించి యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచాడు. తనకు అడ్డే లేదన్నట్టుగా యమాజోష్‌గా సాగిన స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్ మరోసారి తుదిమెట్టుపై కూలబడ్డాడు. జొకోవిచ్‌కు కెరీర్‌లో ఇది 10వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2015లో అతనికిది మూడో గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ!