పవన్ కళ్యాణ్ సినిమా ప్రొడ్యూస్ చేస్తా : నితిన్

Posted On:16-09-2015
No.Of Views:327

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని అన్నవిషయం అందరికీ తెలిసిందే. అయితే ఇంతటి అభిమానికి తన అభిమాన హీరోతో సినిమా నిర్మించే అవకాశం వస్తే ఇక తన ఆనందానికి హద్దేముంది. ప్రస్తుతం నాగార్జున నట వారసుడు అఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తూ  సినిమాను నిర్మిస్తున్న నితిన్ తాజాగా పవన్ సినిమా నిర్మించే అవకాశం గురించి ప్రస్థావించారు.
;పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా నిర్మించే అవకాశం వస్తే ఇక వేరే పనులేవి పెట్టుకోకుండా ఆ సినిమా మీదదృష్టి పెడతా. ఆ సినిమా నా ఫిలిం కెరీర్ లోనే చాలా స్పెషల్అవుతుంది.అన్నాడు. ఇప్పటికే చాలా సినిమాల్లో పవన్ పట్ట తన అభిమానాన్ని ప్రదర్శించిన నితిన్ ఇప్పుడు ప్రెస్మీట్లలో కూడా తన అభిమాన కథానాయకున్ని పొగిడేస్తున్నాడు. ప్రస్తుతంఅఖిల్ ప్రమోషన్ తో పాటు తను హీరోగా రూపొందిన కొరియర్‌బాయ్ కళ్యాణ్ సినిమా రిలీజ్‌లతో నితిన్ బిబీగా ఉన్నాడు.