సిద్ధార్థతో ఆటాపాటా!

Posted On:16-09-2015
No.Of Views:263

మనోజ్‌తో పోటుగాడు అల్లరి నరేశ్‌తో జేమ్స్‌బాండ్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు సాక్షీ చౌదరి. ప్రస్తుతం ఆమె సంగీత దర్శకుడు ఇస్మాయిల్ దర్బార్ దర్శకత్వంలో బాలీవుడ్లో ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నారు. సాక్షీకి తెలుగు నుంచి మరో మంచి ఆఫర్ వరించింది.  జీనియస్;, రామ్‌లీలా’ చిత్రాల నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్నసిద్ధార్థలో ఆమె నాయికగా ఎంపికయ్యారు. దయానంద్ రెడ్డి దర్శకత్వంలో ఆర్.కె. నాయుడు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మరో కథానాయికగా రాగిణీ నంద్వానీ నటిస్తున్నారు.దాసరి కిరణ్ మాట్లాడుతూ- బుల్లితెర మెగాస్టార్ ఆర్.కె. నాయుడు ఇందులో పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. అక్టోబర్‌లో హైదరాబాద్‌లో జరగనున్నషెడ్యూల్తో ఈ సినిమా చిత్రీకరణ పూర్తవుతుందిఅని చెప్పారు. ఈ చిత్రానికి కథ: విసు, కెమెరా: ఎస్.గోపాల్ రెడ్డి, సంగీతం: మణిశర్మ, మాటలు: పరుచూరి బ్రదర్స్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ముత్యాల రమేశ్, సమర్పణ: లంకాల బుచ్చిరెడ్డి.