కేబీఆర్ పార్క్లో మహిళపై దాడి

Posted On:16-09-2015
No.Of Views:313

 నగరంలో దోపిడీ దొంగలు బీభత్సం కొనసాగుతూనే ఉంది. తాజాగా బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్ చేస్తున్న మహిళపై ఓ దుండగుడు చైన్ స్నాచింగ్కు యత్నించాడు. అయితే ఆ మహిళ... అతడిని ధైర్యంగా ఎదుర్కొంది.ఈ సందర్భంగా ఆమెపై దుండగుడు దాడి చేసి, గాయపరిచాడు. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. మహిళ వద్ద నుంచి బంగారు గొలుసుతో పాటు ఫోన్ లాక్కున్నాడు. ఈ సందర్భంగా అతడితో మహిళ పెనుగులాడింది. దీన్ని గమనించిన స్థానికులు దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాగా అతడిని కలాపి సంతోష్గా పోలీసులు గుర్తించారు. అతడిపై ఇప్పటికే ఆరు కేసులు ఉన్నాయని....బైకులు ఎత్తుకెళ్లటంతో పాటు చైన్ స్నాచింగ్లకు పాల్పడేవాడని, గత నెల 31న జైలు నుంచి సంతోష్ విడుదల అయినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా దొంగతనం చేసేందుకు ఈ రోజు ఉదయం 7 గంటలకే కేబీఆర్ పార్క్ వద్ద అతడు కాపు కాసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బాధిత మహిళ నవీన మాట్లాడుతూ ...వాకింగ్ చేస్తున్న సమయంలో తనను దొంగ కత్తితో బెదిరించాడని, నీ చైన్ ఇస్తావా?...చచ్చిపోతావా? అని బెదిరించాడని తెలిపింది. తన వద్ద ఉన్న బంగారు గొలుసు, ఫోన్ ఇచ్చేయమన్నాడని, అందుకు తాను నిరాకరించటంతో దాడి చేశాడని, తనను కింద పడేశాడని ఆమె పేర్కొంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.