ప్రత్యర్థి పంచ్‌లకు ఆసీస్ బాక్సర్ మృతి

Posted On:16-09-2015
No.Of Views:347

సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఓ బాక్సర్ మృతి అక్కడ తీవ్ర దుమారాన్నే రేపుతోంది. మంగళవారం జరిగిన ఐబీఎఫ్ సూపర్ ఫెదర్వెయిట్ రీజనల్ టైటిల్లో పోటీ పడిన డేవీ బ్రౌనీ జూనియర్ అనే బాక్సర్ ప్రత్యర్థి పంచ్లకు రింగ్లోనే కుప్పకూలాడు. అనంతరం ఆస్పత్రికి తీసుకెళ్లగా మెదడుకు తగిలిన గాయంతో చనిపోయాడు. దీంతో ఈ ప్రమాదకర క్రీడను నిషేధించాల్సిందేనంటూ ఆస్ట్రేలియా మెడికల్ సంఘం (ఏఎంఏ) గళమెత్తుతోంది. బాక్సింగ్పై వేటు వేయాల్సిన తరుణం వచ్చేసింది. 28 ఏళ్ల డేవీకి ఓ కుటుంబం ఉంది.  అతని భార్య, ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఒక్క పంచ్ నిన్ను చంపగలుగుతున్నప్పుడు ఈ అర్థం లేని క్రీడను కొనసాగించడం వృథా అని ఏఎంఏ ఉపాధ్యక్షుడు డాక్టర్ స్టీఫెన్ పార్నిస్ ఆవేదన వ్యక్తం చేశారు. గత మార్చిలోనూ బౌట్ అనంతరం బ్రేడన్ స్మిత్ అనే బాక్సర్ మరణించాడు.